News November 19, 2025
సిద్దిపేట: ‘RRRలో భూమిని కోల్పోతున్న వారిని ఆదుకుంటాం’

రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ హైమావతి తెలిపారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న మర్కూక్, వర్గల్ మండలాల రైతులతో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News January 22, 2026
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సీఎం కప్ పోటీల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, మిషన్ భగీరథ, డీవైఎస్ఓ, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు.
News January 22, 2026
BREAKING: కామారెడ్డిలో విషాదం

కామారెడ్డిలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నాలుగు రోజుల నవజాత శిశువు మృతిచెందిందని బాధితులు ఈరోజు తెలిపారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన గంగ జమున ఈనెల 19న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించగా మగ శిశువు జన్మించారన్నారు. శిశువు తక్కువ బరువు ఉండడంతో పరిశీలనలో ఉంచినప్పటికీ తర్వాత వైద్యులు పట్టించుకోకపోవడంతో చనిపోయాడని ఆరోపించారు.
News January 22, 2026
VJA: YS జగన్‌పై బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్!

YS జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ MLC బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా, మరెన్ని వేషాలు వేసినా ప్రజలు ఆయన్ను నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. లోకేశ్‌ను ‘నవయుగ అభిమన్యుడు’గా అభివర్ణిస్తూ, ఆయన పనితీరు పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తోందని కొనియాడారు.


