News December 1, 2025
సిద్ధిపేట: విధుల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.
Similar News
News February 10, 2026
రైతులకు వాట్సాప్‌లో APMIP సేవలు

AP: వాట్సాప్(మన మిత్ర)లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘రైతులు ఫోన్‌తో 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని పంపి, APMIPను ఎంపిక చేసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు ఆన్‌లైన్‌లో కొని సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చు’ అని తెలిపారు.
News February 10, 2026
తగ్గిన మేడారం ఆదాయం @2026 రూ.12.64 కోట్లు!

మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. గత వారం రోజులుగా 828 హుండీలను లెక్కించగా రూ.12,64,67,051 ఆదాయం వచ్చింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేయగా, అన్ని హుండీలను లెక్కించారు. ప్రస్తుతానికి బంగారు, వెండి అభరణాల లెక్కింపు మాత్రమే మిగిలింది. గత జాతరలో రూ.13.25 కోట్లు ఆదాయం రాగా, ఈ 2026 జాతరలో రూ.12.64 కోట్ల ఆదాయం వచ్చింది.
News February 10, 2026
HYD: జ్యోతిర్లింగాల దర్శనం.. FEB 21 నుంచి షురూ

దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శంచుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. పెద్దలకు రూ.14,700లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్ ధరను అధికారులు నిర్ణయించారు. SHARE IT.


