News February 16, 2025
సిరిసిల్ల: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

బీసీ స్టడీ సర్కిల్‌లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకట స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Similar News
News March 26, 2025
బాలీవుడ్‌లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానమిదే

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..