News September 10, 2025
సిరిసిల్ల: ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. తెలంగాణ పౌరుషం, పోరాటం, త్యాగాన్ని ఆమె భావితరాలకు అందించారన్నారు.
Similar News
News December 8, 2025
అనంతపురంలో వాహనదారులపై పడ్డ TDP ఫ్లెక్సీలు

అనంతపురంలో TDP ఫ్లెక్సీలు కిందపడి ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అనంతపురం తపోవనం బ్రిడ్జిపై నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారని పలువురు ఆరోపించారు. కాగా నేడు ఫ్లెక్సీలు ఉన్న మార్గంలో పలువురు వెళ్తుండగా ఫ్లెక్సీలు పైన పడడంతో బైక్‌పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా జనాలపై ఎందుకు మీకు ఇంత కక్ష అంటూ YCP తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు పోస్ట్ చేసింది.
News December 8, 2025
NTR: 10 నుంచి ఏపీ టెట్-2025 పరీక్షలు

ఏపీ టెట్-2025 పరీక్షలు ఈ నెల 10 నుంచి 21 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో జరుగుతాయని DEO సుబ్బారావు తెలిపారు. విజయవాడ, మైలవరం, తిరువూరులో 7, అలాగే ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హాల్ టికెట్, ఫొటో గుర్తింపుతో రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని చెప్పారు.
News December 8, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఊపందుకున్న క్యాటిల్స్ షెడ్ల నిర్మాణం

ఎన్టీఆర్ జిల్లాలో పశువులు, మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. 13 మండలాల పరిధిలోని 239 పంచాయతీల్లో 831 పనులకు మంజూరు కాగా, ప్రస్తుతం 565 షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 189 షెడ్లు పూర్తయ్యాయి. పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల్లో పనుల పురోగతి మెరుగ్గా ఉంది. సకాలంలో నిధులు మంజూరు చేసి, లక్ష్యం అధిగమించాల్సి ఉంది.


