News November 5, 2025
సిరిసిల్ల కవి ‘జిగిరి’ నవలకు దేశవ్యాప్త గుర్తింపు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ‘జిగిరి’ నవల దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఈ నవలను ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, సింధీ, మలయాళం తదితర 10 భాషల్లోకి అనువదించారు. ఒడియా, పంజాబీ భాషల్లో 2 సార్లు అనువాదమవ్వడంతో మొత్తం 12 అనువాదాల ఘనతను ఈ నవల సాధించింది. కాగా, తెలుగు సాహిత్యంలో ఒకే నవల ఇన్ని భాషల్లోకి అనువాదం అవ్వడం చాలా అరుదు.
Similar News
News January 24, 2026
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.
News January 24, 2026
జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2026
విశాఖ ఉత్సవ్-2026.. నేడు ఆర్కే బీచ్‌లో గాయని సునీత సందడి

భారతదేశపు అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్-2026లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయని సునీతతో ‘మ్యూజికల్ నైట్’ జరగనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సీ టు స్కై’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగర తీరంలో సాగే ఈ సంగీత వేడుకను తిలకించేందుకు నగరవాసులు, పర్యాటకులు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.


