News December 1, 2025
సిరిసిల్ల: కొత్త యాజమాన్యాలు చేతికి మద్యం దుకాణాలు

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు కొత్త యాజమాన్యాల నిర్వహణలోకి వచ్చాయి. Dec 1 నుంచి జిల్లాలోని 48 దుకాణాల నిర్వహణకు గత నెలలో టెండర్లు నిర్వహించగా, టెండర్ దక్కినవారు సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలో చాలా దుకాణాలు కొత్త వ్యాపారులకు దక్కగా, పాతవారికి కొందరికే అవకాశం లభించింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు వారికి గుడ్‌విల్ ఇచ్చి తిరిగి దుకాణాలను దక్కించుకున్నారు.
Similar News
News February 18, 2026
కలెక్టర్ గారే స్వయంగా వచ్చారు.. ఆగర్తిపాలెంలో మెగా ఈవెంట్!

పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం, లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగర్రు సొసైటీ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఆగర్రు సొసైటీ ఛైర్మన్ మేడిది జాన్ రాజు ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఆర్డీఓ దాసి రాజు, ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పశుపోషకులు తమ పశువులకు వైద్యం చేయించుకున్నారు.
News February 18, 2026
ఏలూరు: నిరుద్యోగులకు గమనిక

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీయల్‌టీసీ సహాయ సంచాలకుడు భూషణం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్, పెరిఫెరల్స్ (కంప్యూటర్ హార్డ్వేర్)కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆపైన ఉత్తీర్ణులైన వారు 15-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. ఈనెల 25లోపు సంప్రదించాలన్నారు.
News February 18, 2026
జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.


