News December 2, 2025
సిరిసిల్ల: చేరికలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. జిల్లాలో 260 పంచాయతీలు, 2268 వార్డులు ఉండగా, అత్యధిక స్థానాలలో తమ నాయకులను గెలిపించుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతమైందని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని పార్టీ ఆలోచనగా ఉంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఈ మేరకు వివిధ పార్టీల నుంచి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Similar News
News February 9, 2026
డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

AP: డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ‘స్త్రీ నిధి’ పథకాన్ని డిజిటల్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న రూ.5 లక్షల లోన్‌ను రూ.8 లక్షలకు పెంచింది.
News February 9, 2026
నల్గొండ: 5 గంటల తరువాత అంతా సైలెన్స్

NLG కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
News February 9, 2026
పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


