News August 23, 2025

సిరిసిల్ల: జలాశయాల్లో స్థిరమైన నీటిమట్టం

image

అప్పర్, మిడ్ మానేరు జలాశయాల్లో స్థిరమైన నీటిమట్టం ఉందని అధికారులు శనివారం తెలిపారు. అప్పర్ మనేరు ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 1482.45 అడుగుల వద్ద నిల్వ ఉంది. సామర్థ్యం 1.99 TMCలుగా నమోదైంది. ప్రవాహం లేదని, RMC ద్వారా 70 క్యూసెక్కుల విడుదల కొనసాగుతుంది. మిడ్ మనేరు రిజర్వాయర్‌లో 313.62 మీటర్ల వద్ద 17.605 TMCలు నిల్వ కాగా, సగటు ఇన్‌ఫ్లోలు 19,896 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లోలు 7,940 క్యూసెక్కులుగా నమోదైంది.

Similar News

News January 18, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాలో విసిరిన చలి పంజా

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట మండలంలో 11.0, బల్మూరు, తెలకపల్లి, 11.1, బిజనేపల్లి, వెల్దండ, పదర, కల్వకుర్తి మండలాలలో 11.7 నాగర్‌కర్నూల్, ఊర్కొండ మండలంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం వేళలో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News January 18, 2026

విశాఖ: మాస్టర్ ప్లాన్ మార్చిలోనే..!

image

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.

News January 18, 2026

పార్వతీపురం: ఉదయాన్నే యాక్సిడెంట్.. మహిళ మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన గుండ్రెడ్డి అప్పమ్మ (68) పాలు తీసుకునేందుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గురుగుబిల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.