News April 23, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 43.7°c, ఇల్లంతకుంట 43.6 °c,వేములవాడ రూరల్ 43.6°c, బోయిన్పల్లి 43.6 °c,కోదరావుపేట 43.4°c, తంగళ్ళపల్లి 43.3, వీర్నపల్లి 43.1, రుద్రంగి 42.8 °c, గంభీరావుపేట 42.8 °c,ఎల్లారెడ్డిపేట 42.6 °c,ముస్తాబాద్ 41.1°cలుగా నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 13, 2026
వనపర్తి: జిల్లా పోలీస్ దర్బార్ నిర్వహణ

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సాయుధ దళ (AR) సిబ్బందితో ఎస్పీ సునీత రెడ్డి ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. సిబ్బంది తమ సమస్యలైన వీక్లీ ఆఫ్, పెండింగ్ బిల్లులు, విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సావధానంగా విన్న ఎస్పీ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
2,06,052 మంది రైతులకు లబ్ధి: కలెక్టర్

నంద్యాల మండలం బిల్లలాపురంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత ద్వారా 2,06,052 మంది రైతులకు రూ.119.91 కోట్లు, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకూ రూ.400.2 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 13, 2026
మార్చి15న విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మార్చి 15న విశాఖ రానున్నారు.15న రాత్రి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 19న ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.


