News December 1, 2025
సిరిసిల్ల జిల్లాలో తొలిదశ నామినేషన్లు 385

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 85 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 539 నామినేషన్లు దాఖలు కాగా 385 నామినేషన్లను ఆమోదించారు. డబుల్ నామినేషన్ల కారణంగా మిగతా వాటిని తిరస్కరించారు. 748 వార్డులకు 1,696 నామినేషన్లు రాగా, సక్రమంగా లేని కారణంగా ఐదు నామినేషన్లను తిరస్కరించారు. డబుల్ నామినేషన్లు పోగా 1,624 నామినేషన్లను ఫైనల్ చేశారు.
Similar News
News February 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News February 16, 2026
NZB: మేయర్ ఉమారాణి నేపథ్యమిదే!

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి నగరంలోని కసాబ్ గల్లికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. గర్ల్స్ హై స్కూల్ 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చేసిన ఆమె ఓపెన్‌లో BA పూర్తి చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజినీర్లు, మరొకరు MBA చేశారు. ఆమె భర్త కరాటే రమేశ్ అందరికీ సుపరిచతమే.
News February 16, 2026
కాకినాడ: 18న జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, ఫోన్ పే సంస్థల్లో 110 ఖాళీల భర్తీకి ఎంపికలు జరుగుతాయని వెల్లడించారు. టెన్త్ నుంచి డిగ్రీ అర్హత, 18-35 ఏళ్ల వయసున్న వారు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


