News March 14, 2025

సిరిసిల్ల: డ్రైవర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ వాహనానికి డ్రైవర్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి పీ.లక్ష్మీరాజం తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్య, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జి అర్హతలు కలిగి ఉన్నవారు ఈనెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో 33వ నంబర్ రూమ్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 7, 2026

MNCL: కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే వరకు

image

కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి, 4 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత నడిపల్లి దివాకర్ రావుది. 1981లో కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, ఆ తర్వాత 1999, 2004, 2014, 2018 ఎన్నికల్లో లక్షెట్టిపేట, MNCL నుంచి MLAగా విజయం సాధించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సాకారం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరఫున సేవలందించిన ఆయన రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు.

News February 7, 2026

బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

News February 7, 2026

MHBD: నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ఒకటే!

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల పోరు విభిన్నంగా మారింది. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ వార్డులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు జనసేన నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ‘తూర్పాటి’ కావడం విశేషం. ఒకే సామాజిక వర్గం, ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు తలపడుతుండటంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. ఈ ‘తూర్పాటి’ల సమరంలో విజేత ఎవరోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.