News March 10, 2025

సిరిసిల్ల: తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డే: ఎస్పీ

image

బాధితుల సమస్యల తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్‌డే కార్యక్రమం అని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ.గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 10 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని స్పష్టంచేశారు.

Similar News

News January 21, 2026

నిర్మల్: ‘పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి’

image

నిర్మల్ లోని 42 కౌన్సిలర్ స్థానాలకు, ఖానాపూర్‌లోని 12 కౌన్సిలర్ స్థానాలకు, ముధోల్‌లోని 26 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ రావుల రామ్నాథ్ సూచించారు. నిర్మల్ వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (గాజుల పేట్), (ముధోల్) భైంసా ఎమ్మెల్యే నివాసం వద్ద, ఖానాపూర్ వాళ్ళు స్థానిక బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 21, 2026

శంబర జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

image

శంబర పోలమాంబ జాతర సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బుధవారం అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం పోలీసు అధికారులుతో, దేవదాయ, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు నిశితంగా పరిశీలించి, పటిష్ఠంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 21, 2026

నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

image

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.