News December 2, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి పట్టు దొరికేనా..?

image

పార్లమెంటు ఎన్నికలలో జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సంపాదించుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీపై జనంలో ఉన్న క్రేజ్ అప్పుడు కలిసిరాగా, ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించడం లేదు. సీనియర్ నేత ప్రతాప రామకృష్ణకు ప్రాధాన్యత తగ్గించడంతో బీజేపీలో నేతలు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై వీటి ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Similar News

News February 16, 2026

నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌‌పై కేసు

image

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

News February 16, 2026

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.

News February 16, 2026

10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్‌లో 59, నంద్యాల డివిజన్‌లో 26 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470