News April 10, 2025
సిరిసిల్ల: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే విషయంలో పోలీసులు కట్టెట్టమైన ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతరులు ఎవరు కూడా పరీక్ష కేంద్రాల్లో ఉండకూడదని ఆదేశించారు.
Similar News
News January 14, 2026
జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుతూ వస్తోంది. బుధవారం ఉదయం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2℃, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 14.5℃గా నమోదయ్యాయి.