News February 14, 2025
సిరిసిల్ల: పిల్లలకు భయం పోగొట్టేందుకు SPECIAL క్లాసులు

జిల్లాలోని షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు భయం పోగొట్టడానికి సిరిసిల్ల పట్టణంలోని టీజీఎస్సీ స్టడీ సర్కిల్‌లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మోహన్ రావు తెలిపారు. ఆసక్తికర విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే తరగతులకు హాజరుకావాలని ఆయన కోరారు.
Similar News
News March 25, 2025
ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.
News March 25, 2025
ఎన్టీఆర్: పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2025లో నిర్వహించిన బీపీఈడీ, డీపీఈడీ 1వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
News March 25, 2025
స్వదేశీ MRI మెషీన్.. అక్టోబర్ నుంచి ట్రయల్స్

తొలి స్వదేశీ MRI మెషీన్‌ను భారత్ అభివృద్ధి చేసినట్లు ఎయిమ్స్ ఢిల్లీ తెలిపింది. అక్టోబర్ నుంచి ట్రయల్స్ కోసం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో టెస్టుల ఖర్చులతో పాటు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని వెల్లడించింది. ఈ మెషీన్ వైద్య సాంకేతికతలో భారత్‌ను స్వావలంబన దిశగా నడిపించడంలో సహాయపడనుంది.