News February 10, 2025
సిరిసిల్ల: ప్రజావాణికి 121 దరఖాస్తులు

ప్రజావాణిలో 121 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి 121 దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ పెట్టకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 22, 2025
కడప: ఈ-కేవైసీ చేస్తేనే రేషన్ సరుకులు

ఈనెల 31వ తేదీ లోపు రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి జె.శిరీష తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో పెండింగ్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నెల నిత్యావసర సరుకులు అందుతాయని తెలిపారు. సమీపంలోని చౌక దుకాణం /సచివాలయంలో వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.
News March 22, 2025
విశాఖలో దొంగలు దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&Bఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
News March 22, 2025
తూ.గో: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.