News August 13, 2025
సిరిసిల్ల: ’భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు’

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వర్షంతో వరదలు వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో 18002331495, వాట్సాప్ నంబర్ 9398684240కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు అధికారులు అందుబాటులో ఉండి వరదలతో ఇబ్బందులు పడే ప్రజలకు సహాయం అందిస్తారని స్పష్టం చేశారు.
Similar News
News March 6, 2026
శ్రీవారు అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు కాదు: ధూళిపాళ్ల

టీటీడీ నెయ్యి టెండర్‌ను చంద్రబాబు ఇప్పించలేదని.. నిబంధనలు, సాంకేతిక పరీక్షల అనంతరం సంగం డెయిరీ ఎంపికైందని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంటే శ్రీవారు ఇప్పుడు అవకాశం ఇచ్చారన్నారు. 33 రోజులు తనను జైలులో పెట్టి సంగం సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించినా ఒక్క తప్పూ దొరకలేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో స్వామి దగ్గర YCP తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
News March 6, 2026
గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.
News March 6, 2026
పార్వతీపురం: ‘15 లోగా CSC పనులను పూర్తి చేయాలి’

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.


