News November 30, 2025
సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ప్రజల నుండి వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 18, 2026
పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఇకపై ఏడాదికి 4సార్లు

AP: పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఏడాదికి 4సార్లు నిర్వహించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు JAN 1న మాత్రమే ఓటరు నమోదు జరుగుతోంది. తరువాత పుట్టిన వారు ఏడాది పాటు వేచి ఉంటున్నారు. ఈ బిల్లుతో ఇకపై JAN, APR, JUL, OCT నెలల్లో 1న ఓటు నమోదు చేసేలా చట్టాన్ని సవరించారు. మంత్రి కందుల దుర్గేశ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, మున్సిపల్ ఓట్ల నమోదు కూడా ఏటా 4సార్లు చేస్తున్నారు.
News February 18, 2026
VZM: ‘సివిల్ తగాదాలను ఇరు పక్షాలతో కౌన్సిలింగ్ చేసి పరిష్కరించాలి’

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.
News February 18, 2026
KNR: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులకు తాళలేక మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత(29) ఆత్మహత్య చేసుకుంది. KNR రూరల్ CI నిరంజన్ రెడ్డి ప్రకారం.. GDKలో నివాసముంటుండగా అనారోగ్యం పాలైన భర్త నరేష్‌ను చికిత్స నిమిత్తం KNR ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఇక్కడ కూడా కట్నం కోసం అత్తమామలు వేధించడంతో మనస్తాపం చెంది, తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో మంగళవారం పెట్రోల్ పోసుకుని ప్రాణాలు వదిలింది. కేసు నమోదైంది.


