News February 10, 2025
సిరిసిల్ల: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో 12 ZPTCలు, 123 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News February 11, 2026
మెదక్: రేపు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కలెక్టర్

మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈనెల 12న నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత అధికారులు రెండు రోజులపాటు విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు.. మంత్రులకు CBN హెచ్చరిక

AP: క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని హితబోధ చేశారు. ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అటు శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని CM ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 11, 2026
Peoples Pulse.. ఉమ్మడి రంగారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఇవే!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 104-112 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 95-104, BJP 16-18, MIM 2-3, CPM 2-3, ఇతరులు 6-8 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.


