News September 13, 2025
సిరిసిల్ల: సన్నాలకు బోనస్ అందేదెప్పుడు..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సన్నం వడ్లను సాగు చేశారు. కాగా, వీరంతా రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగిలో సుమారు 10 వేల క్వింటాళ్లకు పైగా సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు బోనస్ పడలేదు. బోనస్ వస్తే పంట పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ స్పందించి ఖాతాల్లో బోనస్ వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
Similar News
News December 5, 2025
ఆదిలాబాద్‌లో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు

10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయి, 8,9వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారి వయస్సు ప్రకారం 5 గ్రూపులుగా విభజించినట్లు తెలిపారు.
News December 5, 2025
సిరిసిల్ల: ‘బస్సులో నగదు బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్’

డబ్బుల బ్యాగులు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగును బస్సులో నుంచి బండారి బాలరాజు ఎత్తుకెళ్లాడన్నారు. ఆ బ్యాగులో రూ.3,97,500 నగదు ఉందని బాధితులు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


