News August 13, 2025

సిరిసిల్ల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలు

image

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతితో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాకు మొత్తం 6 సీట్లు కేటాయించగా.. లంబాడీలకు 4, ఎరుకలకు 1, ఇతరులకు 1 సీటు ఉన్నాయి. ఆసక్తిగలవారు దరఖాస్తులను ఆగస్టు 13 నుంచి 18లోగా కరీంనగర్ గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.

Similar News

News March 6, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 6, 2026

HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

image

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT

News March 6, 2026

కేయూ CELT స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు షెడ్యూల్ ప్రకటింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగంలోని సెల్ట్(CELT) కేంద్రంలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తరగతులను రీషెడ్యూల్ చేశారు. ఈ 6 వారాల(40 రోజుల) కోర్సు ఈనెల 23 నుంచి మే 1 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, గృహిణులు, ఇతరులు మార్చి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. KU విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.1500 ఫీజు అన్నారు.