News October 6, 2025

సిరిసిల్ల: 18 ఫిర్యాదులను స్వీకరించాం: ఎస్పీ

image

ప్రజల నుంచి 18 ఫిర్యాదుల స్వీకరించామని ఎస్పీ మహేష్ బి.గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు.

Similar News

News January 20, 2026

ములుగు: సీట్ బెల్ట్ పెట్టుకోండి.. హెల్మెట్ ధరించండి..!

image

అతివేగం ప్రమాదకరమని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ రెడ్డి అన్నారు. ములుగులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రోడ్డు భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాను రోడ్డు ప్రమాదరహితంగా మార్చుకుందామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు.

News January 20, 2026

ఏలూరు జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్‌

image

ఏలూరులో జాతర మహోత్సవాల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జేబుదొంగలు, ఆకతాయిల కదలికలపై నిఘా ఉంచాలని, భద్రత విషయంలో రాజీ పడకూడదని పోలీసు శాఖకు స్పష్టం చేశారు.

News January 20, 2026

పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

image

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.