News March 6, 2025
సిరిసిల్ల: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటల (సుమారు 60 గంటల) వరకు సాగింది.
Similar News
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.
News December 14, 2025
గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార పత్రం ఇదే

ASF జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయాలని ప్రభుత్వం ఉత్త్వరులు జారీ చేసిన విషయం తెలసిందే. సర్పంచ్ ప్రమాణ స్వీకార పత్రాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. గెలిచిన అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో నిర్ణీత సమయానికి ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 14, 2025
పోలీస్ కానిస్టేబుల్ మానవత్వం.. ఓటేసే తల్లికి సాయం

నర్సింహులపేట మండల కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన చంటి పిల్ల తల్లికి అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సుష్మా సాయం చేశారు. ఆమె ఆ చంటి పిల్లను ఎత్తుకుని కాసేపు లాలించారు. ఈ సమయంలో చిన్నారి తల్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానిస్టేబుల్ చంటి పిల్లను లాలించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల విధుల్లో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసిందని కొందరు అభినందించారు.


