News November 19, 2025

సిర్పూర్(టి): ఈ నెల21 షూటింగ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.

Similar News

News January 12, 2026

భూపాలపల్లి: ‘ధాన్యం ట్యాబ్ ఎంట్రీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు’

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో పౌర సరఫరాలు, సహకార శాఖ, డీఆర్‌డీఏ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఎంట్రీల ఆలస్యం వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతాయని, రోజువారీగా డేటా నమోదు చేయాలన్నారు.

News January 12, 2026

పాసు పుస్తకాలు పంపిణీకి ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పై అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షించారు. రెండవ విడత పట్టాదారు పాసుపుస్తకాలు ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే పంపిణీకి సిద్ధం చెయ్యాలని, 13 మండలాలకు సంబంధించి 14 గ్రామాలకు రీ సర్వే పూర్తి చేసి సిద్ధం చెయ్యాలన్నారు. 170 గ్రామాలకు 66,126 పట్టాదారు పాసుపుస్తకాలు రాగా, 62,483 పంపిణీ జరిగాయన్నారు.

News January 12, 2026

Gen Zలో ఎంతో క్రియేటివిటీ: మోదీ

image

Gen Z క్రియేటివిటీతో నిండి ఉందని PM మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో జాతి నిర్మాణంలో యువశక్తి ముందంజలో ఉందని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని వరుసగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతో దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. కల్చర్, కంటెంట్, క్రియేటివిటీతో కూడిన ఆరెంజ్ ఎకానమీలో దేశం అద్భుత వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.