News May 7, 2025

సిలిండర్‌కు అధిక ధరలు తీసుకుంటే చర్యలు: జేసీ

image

నెల్లూరు జిల్లాలో వినియోగదారుల నుంచి గ్యాస్ డెలివరీ బాయ్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. తన కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీదారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్ డెలివరీ చేయాలని సూచించారు. మీ ఏరియాలో సిలిండర్‌కు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో రైతులకు లోన్లు రావడం లేదు..!

image

నెల్లూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ వాటిని చుక్కల భూములుగా చూపారని పలువురు రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు 1బి అడంగల్ తీసుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చుక్కల భూములకు 1బి అడంగల్ ఇవ్వడం లేదు. దీంతో రైతులకు రుణాలు అందక అవస్థలు పడుతున్నారు.