News February 6, 2025

సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్‌ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.

Similar News

News February 9, 2026

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఛాంబర్‌లో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన మూడవ విడత రాండమైజేషన్ ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు

News February 9, 2026

ఆదిలాబాద్: ప్రచారానికి ముఖ్యనేతలేవరు రాలే..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

News February 8, 2026

ADB: ఈ నెల 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.