News December 2, 2025
సీఎంకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి

కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా, చారిత్రక ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు జలాలను నియోజకవర్గ రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 9, 2026
గుంటూరు: యువతి అదిరిపోయే స్కెచ్.. రూ.60 లక్షలు గోవిందా.!

ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భారీగా నష్టపోయారు. పాతగుంటూరుకు చెందిన శ్రీనివాసరావుకు ఓ యువతి పరిచయమై, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మి విడతలవారీగా రూ.60 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత యువతి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2026
US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.
News February 9, 2026
పోలవరం జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందా?

ఈ నెల 11వ తేదీ నుంచి AP అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. పోలవరం నష్ట పరిహారం R&R ఇంకా చాలామందికి జమ కాలేదు. పోలవరం జిల్లా ఏర్పడినా.. ఇంకా చాలా శాఖలకు అధికారుల నియామకం జరగలేదు. ఈ సమస్యలపై రంపచోడవరం MLA శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో సమస్యలు, పర్యాటక అభివృద్ధికి చర్యలు గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు.


