News April 14, 2024

సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా

image

సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా పడింది. శనివారం రాత్రి విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేయగా జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు సీఎం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పెడనలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15న జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News December 14, 2025

రేపు గుడివాడకు రానున్న వందే భారత్

image

వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News December 13, 2025

గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

News December 13, 2025

21న మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు స్పెషల్ ట్రైన్

image

అజ్మీర్ ఉరుసు ఉత్సవాలకు వెళ్లేందుకు గాను ఈ నెల 21వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్‌కు ప్రత్యేక ట్రైన్‌ను వేసినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. 28వ తేదీ అజ్మీర్ నుంచి బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు తిరిగి మచిలీపట్నం చేరుకుంటుందని చెప్పారు.