News April 21, 2024
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం HYD నుంచి హెలికాప్టర్లో వస్తే భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగనున్నారు. రోడ్డు మార్గంలో వస్తే పెద్ద చెరువు నుంచి టాప్స్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ HYD చౌరస్తా, జగదేవపూర్ చౌరస్తా మీదుగా వినాయక చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ అనంతరం సాయిబాబా గుడి వరకు ర్యాలీగా ముందుకు సాగుతారు.
Similar News
News December 4, 2025
NLG: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలు: రాణీ కుముదిని

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు.
News December 4, 2025
నల్గొండ: నామినేషన్ల పక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. క్లస్టర్ కేంద్రంలోని రిజర్వేషన్లు, ఫ్లెక్సీ మార్గదర్శకాలు, డిజిటల్ క్లాక్ వివరాలు తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌ను పరిశీలనలో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.


