News December 3, 2025

సీఎం పర్యటనను విజయవంతం చెయాలి: జేసీ

image

భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 5 తేదీ పర్యటనను విజయవంతం చెయ్యాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం భామినిలో మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎవరికి కేటాయించిన పనులు వారు పక్కగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉండాలని, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

Similar News

News February 17, 2026

రూ.10 కోట్లు చెల్లించాల్సిందే.. విశాల్‌కు కోర్టు ఆదేశం

image

ప్రముఖ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్స్‌కు వెంటనే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇందుకు ఆరు వారాల సమయం కావాలంటూ హీరో మరో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టేసింది. గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా సినిమా తీస్తానని విశాల్ తమ వద్ద రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ లైకా 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

News February 17, 2026

రామాలయ అభివృద్ధి పనులకు గ్రౌండ్‌ మార్కింగ్‌

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి మంగళవారం గ్రౌండ్‌ మార్కింగ్‌ పనులు నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఈ పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ అధికారులు కేటాయించిన భూమిని దేవస్థానానికి అప్పగించడంతో, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 17, 2026

రంజాన్ ఏర్పాట్లపై కలెక్టర్ తేజస్ సమీక్ష

image

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్యం, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరాలో లోటు ఉండకూడదన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, ముస్లిం ఉద్యోగులకు గంట ముందు వెళ్లే వెసులుబాటు కల్పించాలని సూచించారు.