News November 30, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తుమ్మల

కొత్తగూడెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రోజు పరిశీలించారు. డిసెంబర్ 2న మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ, ఎమ్మెల్యేలు కూనంనేని, జారే, పాయం లతో కలిసి ఏర్పాట్ల సమీక్ష, సూచనలు చేశారు.
Similar News
News February 16, 2026
విశాఖ డెయిరీ పాల రేట్లు ఎంత పెరిగాయంటే..

విశాఖ డెయిరీ పాల అమ్మకం ధరలను పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అర లీటర్ హోమోజినైజ్డ్ డబుల్ డోన్డ్ పాలు ధర రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర అర లీటరు రూ.28 నుంచి రూ.29కు పెంచింది. స్టాండర్ డైజ్డ్ పాలు అర లీటరు రూ.31 నుంచి రూ.32కు, ఫుల్ క్రీం పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కు పెరిగింది.
News February 16, 2026
నిజమాబాద్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

నేడు జరగనున్న నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క నగరానికి రానున్నారు. తొలుత కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తారు. తర్వాత మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. MIM కార్పోరేటర్‌లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకోనున్న సంగతి తెలిసిందే.
News February 16, 2026
సిద్దిపేట: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఛైర్మన్ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేస్తున్నామన్నారు.


