News April 11, 2025

సీఎం పర్యటన ట్రయల్ రన్.. నిలిచిపోయిన ట్రాఫిక్

image

సీఎం కడప జిల్లా పర్యటన కోసం గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేశారని ప్రయాణికుల ఆరోపించారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే మార్గంలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాని పేర్కొన్నారు. ఒంటిమిట్టకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. రాములోరికి ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

Similar News

News January 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810

News January 17, 2026

కడప: నదిలో మృతదేహం కలకలం

image

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 16, 2026

కమలాపురం: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే

image

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వీర శివారెడ్డికి ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు, అనుచరవర్గం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.