News April 25, 2024
సీఎం రమేశ్ సంపద రూ.497.59 కోట్లు

అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, భార్య శ్రీదేవికి కలిపి రూ.497.59 కోట్ల ఆస్తులున్నాయి. రమేశ్ చర, స్థిరాస్తులు రూ.292 కోట్లు, భార్య స్థిర, చరాస్తులు రూ.205.53 కోట్లు. రమేశ్ పేరుతో వివిధ కంపెనీల్లో 10.49 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. బంగారం ఆయన పేరిట 6.92 కిలోలు శ్రీదేవి పేరిట 8.19 కిలోల ఉంది. వీరికి 3 కార్లు ఉన్నాయి. వీరికి అప్పులు రూ.101.61 కోట్లు ఉన్నాయి. రమేశ్‌పై 7 కేసులు ఉన్నాయి.
Similar News
News April 17, 2026
జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్‌కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సమీక్షలో మాట్లాడరు. ఏప్రిల్ 27న ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమానికి సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఎల్ఈడీ స్క్రీన్లు పటిష్ఠంగా ఉండాలన్నారు.