News December 1, 2025

సీఎం రేవంత్ మక్తల్ పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష

image

డిసెంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటనకు సంబంధించి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం చేపట్టిన అంజనేయస్వామి దర్శనం, బహిరంగ సభకు జరిగే ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రూట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు.

Similar News

News February 17, 2026

చిత్తూరులో ఘోర విషాదం

image

చిత్తూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు పుదుచ్చేరి బీచ్‌లో మృతి చెందారు. చిత్తూరు రామ్ నగర్‌కి చెందిన జశ్వంత్, జయంత్, నవాజ్, సాదిక్ పుదుచ్చేరి బీచ్‌కి వెళ్లారు. వీరిలో జశ్వంత్, సాదిక్ సముద్రంలోకి దిగి కొంతసేపటికే నీళ్లలో చిక్కుకుని గల్లంతయ్యారు. జాలర్లు వీరి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చిత్తూరుకు తరలించినట్లు సమాచారం.

News February 17, 2026

JGTL: కాంగ్రెస్‌లో ‘జీవన్’ సెగ.. పార్టీ మార్పు తప్పదా?

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.

News February 17, 2026

పాలమూరు: కాంగ్రెస్ ఖాతాలోకి 17 ఛైర్మన్, 1 మేయర్

image

ఉమ్మడి పాలమూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/ మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (INC) 17 ఛైర్మన్, 1 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 2 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFB(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లకు చెరొకటి ఛైర్మన్ స్థానాలు దక్కాయి.