News March 26, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తుమ్మల తనయుడు

image

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికలో యుగేందర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా రేపు కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో తనను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయాలని యుగేందర్ సీఎంను కోరినట్లు సమాచారం.

Similar News

News February 18, 2026

ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 18, 2026

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

ఖమ్మం: ‘అభివృద్ధి పనులు, రుణాల రికవరీపై సమీక్ష’

image

జిల్లాలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ పనులపై అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ బుధవారం సమీక్షించారు. ఉపాధి హామీ పనుల పురోగతి పెంచి, చెల్లింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి చేయాలని, ఎన్‌పీఏల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, గ్రాంట్ల వినియోగంలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.