News December 3, 2025

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ADB కలెక్టర్, ఎస్పీ

image

ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మంగళవారం రాత్రి సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వారితో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.

Similar News

News February 16, 2026

కోదాడ: కర్ల రాజేశ్ తల్లికి పెన్షన్, భూమి, ఇల్లు: కలెక్టర్

image

పోలీస్ లాకప్‌లో మృతిచెందిన కోదాడకు చెందిన కర్ల రాజేశ్ మాతృమూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, మూడు ఎకరాల భూమి, ఇళ్లు అందిస్తామని సోమవారం రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రామచంద్రన్‌కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది అందిస్తామన్నారు.

News February 16, 2026

చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.

News February 16, 2026

నంద్యాల: గాజులపల్లి టన్నెల్ పూర్తి

image

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్‌) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.