News September 12, 2025

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

తంగళ్లపల్లి PHCని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు, వార్డులు, మందుల గదిని పరిశీలించారు. రోగులతో సమస్యలడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. OP వివరాలపై ఆరా తీశారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా కృషి చేయాలన్నారు.

Similar News

News December 6, 2025

VJA-HYD విమాన ఛార్జీల పెంపు.. కారణమిదే.!

image

ఇండిగో సహా పలు సర్వీసులు రద్దు కావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్ ఆన్‌లైన్‌లో టికెట్ ధరలు ఏకంగా రూ. 17 వేల నుంచి రూ. 60 వేల వరకు చూపిస్తున్నాయి. ఈ అధిక ధరలపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని టికెట్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు.

News December 6, 2025

శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

image

AP: విద్యుత్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.