News August 29, 2024
సీజనల్ వ్యాధుల పై దామోదర్ రాజనర్సింహ సమీక్ష
హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ ఫీవర్, డెంగ్యూ నియంత్రణపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Similar News
News September 21, 2024
తిరుమల లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ రఘునందన్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎంపీ Xలో పోస్టు చేశారు. పవిత్రతకు మారుపేరైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయడం క్షమించరాని నేరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు.
News September 21, 2024
నర్సాపూర్: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదురు కుదుర్చుకోవచ్చని నర్సాపూర్ న్యాయమూర్తి కే అనిత సూచించారు. నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలీస్ అధికారులు హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారీలు రాజి కుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News September 20, 2024
విశ్రాంత అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాలస్వామి
విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి వేణుగోపాలస్వామి నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ వేణుగోపాలస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు విశ్రాంత ఉద్యోగులు పోలీసు సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ అఫ్జల్, జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి, జీవన్, జహింగీర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.