News March 14, 2025
సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 26, 2025
వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?

కొందరికి చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే వేసవి కాలంలో రెగ్యులర్‌గా చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ పెరగడం, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు తింటే ప్రమాదం లేదని పేర్కొంటున్నారు.
News March 26, 2025
నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
News March 26, 2025
100% ఈకేవైసీ పూర్తిచేయాలి: జేసీ సూరజ్

రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని, జిల్లాలోని అందరూ పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్‌లను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశించారు. ఈ ప్రక్రియను 100% పూర్తిచేయాలన్నారు. వార్డు సచివాలయాల్లో, రేషన్ షాపులలో డీలర్ వద్ద ఉన్న ఈ-పాస్ పరికరాలు మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా, మిగిలిన వారు ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు.