News April 10, 2025

సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

సీతానగరం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండయ్య మృతి చెందారు. మరిపివలసకు చెందిన పండయ్య (65) పాలు పోసి ఇంటికి వస్తుండగా రోడ్డు దాటే సమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. SI రాజేశ్ ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News January 15, 2026

20 నుంచి కేయూ దూరవిద్య ఎమ్మెస్సీ పరీక్షలు

image

కేయూ పరిధిలోని దూరవిద్య కేంద్రం(సీడీఓఈ) ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్, ఫైనలియర్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ప్రీవియస్ పరీక్షలు ఈ నెల 20, 22, 24, 27 తేదీల్లో జరుగుతాయి. ఫైనలియర్ పరీక్షలు 20, 22, 24, 27, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

News January 15, 2026

బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

image

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.

News January 15, 2026

సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.