News August 22, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు. ఐదు దశాబ్దాల పాటు సీపీఐలో వివిధ హోదాలో పని చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. సీపీఐ ఉద్యమాలతో కీలక నేతగా ఎదిగారు.

Similar News

News January 12, 2026

భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హోదాలవారీగా ఎన్నికల సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News January 12, 2026

ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

image

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.

News January 12, 2026

చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.