News February 5, 2025

సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2025

MNCL: త్వరలో వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మండలాల గ్రామాల వాహనాలకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. స్థానిక వాహనాలకు చెక్పోస్టుల వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయమన్నారు. 24 గంటలు వాహనదారులు రాకపోకలు సాధించుకోవచ్చని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుతో ఇక్కడి వాహనదారులకు ఇబ్బందులు తలుగుతాయని, దానిపై ఉన్నతాధికారులు పునరాలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 9, 2025

రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

image

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

News February 9, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

image

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15399170>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.

error: Content is protected !!