News February 16, 2025

సీసీ కెమెరా 100 మందితో సమానం: భద్రాద్రి ఎస్పీ

image

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, ఇళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాద నివారణలో ఉపయోగపడతాయన్నారు.

Similar News

News April 19, 2026

గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

image

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.