News November 20, 2025
సీ- ప్లేన్ సర్వీస్ ప్రాజెక్టుకు ప్రతిపాదన: కలెక్టర్

మలికిపురం మండలం దిండి నదీ తీరంలో నీటిపై ట్యాండ్ అయ్యే సీ- ప్లేన్ సర్వీసుల ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదించిన తొమ్మిది ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టును దిండి నదీ తీరంలో చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.20 కోట్లతో పనులు ప్రతిపాదించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ చెప్పారు.
Similar News
News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూసున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గొల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదాచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
News January 14, 2026
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News January 14, 2026
పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు ఇవే..

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ


