News October 7, 2025

సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 18, 2026

విశాఖ: 17 రోజుల్లో రూ.120 కోట్ల మద్యం తాగేశారు

image

విశాఖలో ఈనెల మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖ పరిధిలో 280 మద్యం దుకాణాల ద్వారా 1,52,000 లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి. అదేవిధంగా 81000 బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు డిపో మేనేజర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కంటే ఐదు శాతం ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.

News January 18, 2026

బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన నేతలు

image

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News January 18, 2026

విశాఖ పోర్టుకు మరో రికార్డు

image

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.