News May 7, 2025

సుప్రీం కోర్టులో బోరుగడ్డకు చుక్కెదురు 

image

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే విచారించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో బోరుగడ్డ అనిల్‌కు చట్టపరంగా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

Similar News

News February 8, 2026

GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం‌, మైనర్ల డ్రైవింగ్‌ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.

News February 8, 2026

GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.

News February 8, 2026

రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.