News February 10, 2025
సుల్తానాబాద్: తండ్రి, కొడుకు అరెస్ట్

సుల్తానాబాద్ పట్టణం శాస్త్రి నగర్‌లో పోలీసుల తనిఖీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల వివరాలు.. శాస్త్రి నగర్‌కు చెందిన శ్రీనివాస్(48) తన చిన్న కుమారుడు చంద్రప్రకాశ్ మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి తన ఇంటి వద్ద నిల్వ ఉంచాడు. వేరే దొంగతనం కేసులో కొడుకు అరెస్టయ్యాడు. అనంతరం గంజాయిని శ్రీనివాస్ బైక్‌పై తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News February 7, 2026
కాలే కడుపునకు మండే గంజి

విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు నోరు కాలేంత వేడి గంజి ఇచ్చినా అది ఎంతో రుచిగా, తృప్తిగా అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేదుగా అనిపిస్తాయి. ఏదైనా వస్తువు లేదా సాయం మనకు బాగా అవసరమైనప్పుడు దాని నాణ్యత కంటే ఆ సమయంలో అది అందడమే గొప్ప విషయంగా భావిస్తాము. నిజ జీవితంలో సరైన సమయానికి లభించే సాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ సామెతను వాడుతుంటారు.
News February 7, 2026
సూర్యుడికి అర్ఘ్యం.. ఎప్పుడు సమర్పించాలంటే?

2026, FEB 8న భాను సప్తమి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యోదయ ముహూర్తంలో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్ఠం. మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకే ప్రారంభమవుతుంది. కావున 5:26 AM – 7:13 AM మధ్య పుణ్యస్నానాలు ఆచరించాలి. ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా వదలాలి. ఈ పవిత్ర సమయంలో ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం.
News February 7, 2026
అనకాపల్లి: 10 విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

తత్కాల్ స్కీమ్‌లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు రూ.1,000 ఫైన్‌తో ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాల మేరకు రెగ్యులర్, ఒకసారి పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ నెల12వ తేదీ వరకు www.bseap.org వెబ్ సైట్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


