News August 20, 2025
సుల్తానాబాద్ మండలంలో కలెక్టర్ తనిఖీలు

సుల్తానాబాద్ మండలంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం పర్యటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల్లో తనిఖీ చేశారు. రూ.12.50 లక్షలతో కొనుగోలు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎన్‌ఎస్‌టి యంత్రాలను కలెక్టర్ ప్రారంభించారు. సహకార సంఘం గోడౌన్‌ను, ఎరువుల షాప్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తదితరులున్నారు.
Similar News
News January 21, 2026
ఉట్నూర్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.
News January 21, 2026
తిరుపతిలో 60 కేసుల నమోదు

తిరుపతి నగరంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్‌పై 37, ట్రాఫిక్ ఉల్లంఘనపై 23 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు మొత్తం రూ.3,81,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన ఒక్కొక్కరికి రూ.10వేలు, నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500 చొప్పున జరిమానా వేశారు.
News January 21, 2026
NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.


