News August 20, 2025

సుల్తానాబాద్: ‘రోగులకు మెరుగైన సేవలు అందించాలి’

image

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, పీఏసీఎస్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.12.50 లక్షల విలువైన అల్ట్రాసౌండ్, ఎన్‌ఎస్‌టీ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 17, 2026

NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

image

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.

News January 17, 2026

కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

image

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.

News January 17, 2026

సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

image

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.