News March 6, 2025
సుల్తానాబాద్: హరికృష్ణ ఓటమికి ఒక్కటైన అగ్రకుల నేతలు

అగ్రకుల నేతలంతా ఏకమై బీఎస్పీ బలపరిచిన బీసీ నాయకుడు, ఉమ్మడి KNR, MDK, ADB, NZB ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఓటమిపాలు చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల రవీందర్ ఆరోపించారు. ఆయన సుల్తానాబాద్‌లో మాట్లాడుతూ.. ఒక సామాన్యుడిని ఓడించేందుకు కాంగ్రెస్, BJP అభ్యర్థులు ఒక్కటై వందలకోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనని ఆరోపించారు.
Similar News
News July 8, 2025
తెలుగుజాతి నంబర్ వన్ కావడమే లక్ష్యం: CBN

AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, 24 గంటలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.
News July 8, 2025
SRCL: మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ కనెక్షన్లు మంజూరు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు 458 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. SRCL కేంద్రంలోని గీతా నగర్ జడ్పీహెచ్ఎస్‌లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ స్వరూప రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కట్టెల పొయ్యి మీద భోజనం తయారు చేయవద్దన్నారు.
News July 8, 2025
NRML: ‘కార్లలో వస్తే ఏం తెలుస్తది.. కాలినడకన రండి’

ప్రభుత్వాలు మారినా పల్లెల్లో పరిస్థితులు మారడం లేదనే దానికి నిదర్శనం ఈ చిత్రం. భైంసా నుంచి కుబీర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో సాంగ్వి వద్ద రోడ్డు అధ్వానంగా తయారైంది. సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్లలో వస్తే తమ సమస్యలు ఏం తెలుస్తాయని, కాలినడకన రావాలంటూ మండిపడుతున్నారు. ఇకనైనా తమ గ్రామానికి బీటి రోడ్డు వేయించి, సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.